పోలీసులే కారణమంటూ ధర్నాకు దిగిన బంధువులు

4 Sep, 2020 17:54 IST|Sakshi

సాక్షి, కృష్టా: యువకుడి ఆత్మహత్య జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వివరాలు.. పరిటాలకు చెందిన మంగిన రాజశేఖర్ రెడ్డి నిన్న రాత్రి కృష్ణా బ్యారేజ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ పట్టుబడ్డ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత కోగంటి బాబు, రాజశేఖర్ రెడ్డిని స్టేషన్ నుంచి విడిపించాడు. దాంతో మృతుడు, బాబుని పొగుడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి రాజశేఖర్‌ రెడ్డిని స్టేషన్‌కి పిలిపించారు. అనంతరం అతడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అకారణంగా తనని స్టేషన్‌కి పిలిచి కొట్టారనే మనస్తాపంతోనే రాజశేఖర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు.(చదవండి: టిక్‌టాక్‌ దంపతుల ఆత్మహత్య!)

ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజశేఖర్‌ రెడ్డి బంధువులు జాతీయ రహదారిపై మృత దేహంతో ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వారిని అక్కడి నుంచి తరలిచే ప్రయత్న చేశారు. 

మరిన్ని వార్తలు