నాలుగు దశాబ్దాల కల సాకారం.. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

21 Aug, 2022 20:50 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న దేవినేని అవినాష్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివసించే వేలాది కుటుంబాల ముంపు కష్టాలు తొలగిపోయాయి. నాలుగు దశాబ్దాల చిరకాల కల సాకారమైది. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్ల వ్యయ అంచనాతో చేపట్టిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఆ ప్రాంత వాసులు వేలాది మంది శనివారం సంబరాలు జరుపుకున్నారు. కనకదుర్గ వారధి దిగువ శంకుస్థాపన ఫలకం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆకాశంలోకి బెలూన్లు ఎగురవేసి, కేక్‌ కోశారు.

ముఖ్యఅతిథి వైఎస్సార్‌ సీపీ తూర్పు ఇన్‌చార్జి అవినాష్‌ మాట్లాడుతూ వరద ముంపు వాసుల కష్టాలు స్వయంగా చూసిన సీఎం వైఎస్‌ జగన్, అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి గొప్ప మనస్సు చాటుకున్నారన్నారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలా హామీలిచ్చి గాలికొదిలేయకుండా ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసి,  పనులను గడువు కంటే ఆరు నెలల ముందే పూర్తి చేశారన్నారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో రామలింగేశ్వరనగర్, భూపేష్‌గుప్తానగర్‌ ప్రజల కష్టాలు తొలగిపోయాయన్నారు.  
(చదవండి: ఏం తమాషాగా ఉందా.. పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చిన నారా లోకేష్‌ బాబు..)

నాడు టీడీపీ.. నిధుల స్వాహా! 
నాటి టీడీపీ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రిటైనింగ్‌ వాల్‌ పేరుతో నిధులు స్వాహా చేసి,  బినామీలతో నాసిరకం రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారని ఆరోపించారు. దీంతో వరద ముంపు ఎక్కువైందన్నారు. వందలాది ఇళ్లను తొలగించేలా వారు ప్రణాళికలు సిద్ధం చేశారని అవినాష్‌ ఆరోపించారు. కానీ సీఎం జగన్‌ కేవలం నిర్మాణ ప్రాంతంలోని ఇళ్లను మాత్రమే తొలగించి, వారికి అన్ని సౌకర్యాలతో మరోచోట ఉచితంగా ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.

రిటైనింగ్‌ వాల్‌ పనులు పూర్తికావడంతో సందడి చేస్తున్న స్థానికులు 

కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్లు తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, వీఎంసీలో వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు తంగిరాల రామిరెడ్డి , టి. కొండారెడ్డి, మెరకనపల్లి  మాధురి, రెహానా నాహీద్, కో ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ అలీం, పార్టీ నాయకుడు దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
(చదవండి: ‘ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవటం కాదు’.. అనురాగ్‌ ఠాగూర్‌పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి)

మరిన్ని వార్తలు