ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి కురసాల

15 Sep, 2020 18:48 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని ఏలేరు, సుద్దగడ్డ ముంపు తీవ్రతను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం పర్యటించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జిల్లాలో 25 వేల ఎకరాల వరకు పంట చేలు ముంపుకు గురయ్యాయన్నారు. ఏలేరు వరద జాలల వల్ల 26 చోట్ల గండ్లు పడ్డాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన ఎన్యూమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వరదల వల్ల నష్టోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఏలేరు ఆధునీకరణను అప్పటి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత పాలకులు ఆధునీకరణ పనులను పూర్తి చేయ్యలేదన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం త్వరలోనే‌ ఏలేరుకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు