రోడ్డుకు అటూ.. ఇటూ.. రెండు పంచాయతీలు

10 Feb, 2021 04:48 IST|Sakshi
కర్నూలు జిల్లాలోని ఓ వీధికి కుడివైపు పేరాయిపల్లె, ఎడమవైపు గోపాలపురం

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో రోడ్డు రెండువైపులా వేర్వేరు పంచాయతీలు

ఆళ్లగడ్డ /ప్రత్తిపాడు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది గానీ.. అక్కడ రెండు పంచాయతీలున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె, గోపాలపురం పంచాయతీలను విభజించేది ఓ వీధి రోడ్డే. పేరాయిపల్లెలో 859, గోపాలపురంలో 563 మంది ఓటర్లున్నారు. గోపాలపురం మొదట్నుంచీ ప్రత్యేక పంచాయతీగానే ఉంది. పేరాయిపల్లె మాత్రం సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిజమ్మలదిన్నె గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది.

1995లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఒకే ఊరిలా ఉన్న ఇక్కడ విడివిడిగా పాఠశాలలు, ఆలయాలు ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండల పరిధిలోని నన్నపనేనివారిపాలెం, గింజుపల్లివారిపాలేలను ఒకే రోడ్డు విడదీస్తుంది. అయితే నన్నపనేనివారిపాలెం తిమ్మాపురం పంచాయతీలో, గింజుపల్లివారిపాలెం పాతమల్లాయపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నాయి. రెండు గ్రామాల్లో కలిపి సుమారుగా 153 మంది ఓటర్లున్నారు. 
 గుంటూరు జిల్లాలో నన్నపనేనివారిపాలెం, గింజుపల్లివారిపాలేల మధ్య రహదారి 

మరిన్ని వార్తలు