కర్నూలు: ‘సార్‌ వీడు నా పెన్సిల్‌ తీసుకున్నాడు.. కేసు పెట్టండి’

25 Nov, 2021 18:11 IST|Sakshi

సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోన్న కర్నూలు చిన్నారులు

సాక్షి, కర్నూలు: బాల్యం అంటే ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. కల్మషం లేని మనసు.. బోసి నవ్వులు, దోస్తనాలు, ఆటలు, బాల్యంలో చేసే ఆ అల్లరి.. అబ్బో చెప్పుకుంటూ పోతే ఇప్పట్లో ఆగదు. అయితే ఈ తరం పిల్లల బాల్యంలో ఇవన్ని కనుమరుగవుతున్నాయి. ఇక 10 ఏళ్ల క్రితం.. పిల్లలను భయపెట్టాలంటే తల్లిదండ్రులు వారి స్కూల్‌ టీచర్ల పేరో, పోలీసుల పేరో చెప్పి.. బెదిరించేవారు. మరీ ముఖ్యంగా ఖాకీల పేరు చెపితే.. గజ్జున వణికేవారు అప్పటి పిల్లలు. మరీ ఈ కాలం పిల్లలు.. అబ్బే వారికి పోలీసులంటే ఏమాత్రం భయంలేదు. పైగా తమకు సమస్య వస్తే.. పోలీసులే తీరుస్తారని కూడా తెలుసు. అందుకే డైరెక్ట్‌గా పోలీసు స్టేషన్‌కే వెళ్లి.. వారితో ధైర్యంగా మాట్లాడుతున్నారు. 

ఈ తరహ సంఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి.. తోటి విద్యార్థి తన పెన్సిల్‌, పుస్తకాలు తీసుకుంటున్నాడు.. రోజు ఇలానే చేస్తున్నాడని.. పోలీసులకు తెలిపాడు. అతని మీద కేసు పెట్టమని కోరాడు. చివరకు పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: Video: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వధువు చేసిన పనికి అంతా షాక్‌!)

చిన్నారి హన్మంతు తోటి విద్యార్థి మీద ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. సదరు విద్యార్థి తన పెన్సిల్‌, పుస్తకాలు తీసుకుంటున్నాడని.. రోజు ఇలానే చేస్తున్నాడని హన్మంతు పోలీసులకు తెలిపాడు. విద్యార్థి మీద కేసు పెట్టాలని పోలీసులను కోరాడు. 
(చదవండి: నీ కడుపుకోత తీర్చలేం.. ‘జై హింద్‌ మాజీ’)

చిన్నారి వాదన విన్న పోలీసులు కేసు పెట్టడం మంచి పద్దతి కాదని.. ఇద్దరు స్నేహంగా ఉండాలని హన్మంతుకు సూచించారు.  అలానే వేరే వారి పెన్సిళ్లు, పుస్తకాలు తీసుకోకూడదని విద్యార్థికి చెప్పి.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. 

చదవండి: రేయ్‌.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా?

మరిన్ని వార్తలు