దేశంలోనే విశిష్ట ప్రాంతం కర్నూలు

27 Mar, 2021 03:33 IST|Sakshi
పౌర విమానయాన శాఖ పంపిన లేఖ

కర్నూలు న్యాయ రాజధాని అని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రస్తావన

విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా హర్షం

సాక్షి, అమరావతి: కర్నూలును రాష్ట్ర న్యాయ రాజధానిగా కేంద్ర పౌరవిమానయాన శాఖ గుర్తించింది. ఉడాన్‌ పథకం కింద మార్చి 28 నుంచి కర్నూలు నుంచి విమాన సర్వీసులను ప్రారంభించడంతోపాటు రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడంపై కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి హరిదీప్‌సింగ్‌ పురి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కర్నూలును ఆంధ్రప్రదేశ్‌ న్యాయ రాజధానిగా పేర్కొనడంతోపాటు చారిత్రాత్మకంగా దేశంలో విశిష్టత కలిగిన ప్రాంతంగా అభివరి్ణంచారు. కర్నూలులో గురువారం జరిగిన ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి వర్చువల్‌ విధానంలో పాల్గొన్నట్లు తెలిపారు. అడవులు, గుహలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన కర్నూలు.. విమానయాన సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క తుంగభద్ర నది, మరోపక్క నల్లమల కొండలు సమాంతరంగా ఉండే ఇక్కడ నల్లమల అడవి, అహోబిలం, బెలూం గుహలు, మహానంది, మంత్రాలయం, ఓర్వకల్లు, సంగమేశ్వరం, కేతవరం, కాల్వబుగ్గ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఈ విమానాశ్రయం నుంచి ఉడాన్‌ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) కింద 80:20 నిష్పత్తిలో విశాఖ, బెంగళూరు, చెన్నై నగరాలకు విమాన సరీ్వసులను ఈ నెల 28 నుంచి నడపనున్నట్లు తెలిపారు. దేశంలో మొత్తం 325 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 56 చోట్ల కొత్తగా విమాన సర్వీసులను అందుబాటులోకి తెచి్చనట్లు ఆయన పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు