ఇరుకు సందుల్లో మీటింగ్‌లు పెట్టి ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా?

24 Jan, 2023 18:49 IST|Sakshi

విశాఖపట్టణం:  ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల తీరు హేయంగా ఉందని తెలుగు సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మిపార్వతి విమర్శించారు. ప్రభుత్వం నిజం చెబితే తప్పుగా ఉందని, అదే టీడీపీ తప్పు చేసినా ఒప్పు అన్నట్లు ప్రతిపక్షాల తీరు ఉందన్నారు.

‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు జీవో నెం. 1 తీసుకువస్తే స్టేలతో అడ్డు పడుతున్నారు. ఎక్కడా వైఎస్సార్‌సీపీ కోర్టులను విమర్శించదు. కానీ కోర్టులను తప్పు దారి పట్టించడంలో టీడీపీ దిట్ట. ఇరుకు సందుల్లో మీటింగ్‌లు పెట్టీ ప్రాణాలు తీస్తే చూస్తూ ఊరుకోవాలా?, హంతకులు ఇద్దరు సాక్ష్యం చెప్పుకున్నట్లు బాలకృష్ణ, చంద్రబాబు మాటలు ఉన్నాయి.

వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో రాజకీయం చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆత్మ గౌరవం ఉండదా?, ఎన్టీఆర్‌ డబ్బు తీసుకుని ఆయనను దూషించిన వ్యక్తులే ఇప్పుడు ఫోటోలు వాడుతున్నారు’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు