ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామాపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి క్లారిటీ

8 Feb, 2023 18:15 IST|Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ టాపింగ్ డ్రామాపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాది ఆండ్రాయిడ్‌ ఫోన్‌. నా ఫోన్‌ లో ప్రతీకాల్‌ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్‌ రికార్డయింది’’ అని చెప్పారు.

‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్‌ చేసిన కాల్‌ కాదు. ట్యాపింగ్‌ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్‌ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని  రామశివారెడ్డి తేల్చి చెప్పారు.

‘‘నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఇద్దరివీ ఐఫోన్‌లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్‌ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్‌ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
చదవండి: కోటంరెడ్డికి ఊహించని షాక్‌.. దెబ్బ అదుర్స్‌!

మరిన్ని వార్తలు