ఆ రైల్లో సీటు దొరకడమే కష్టం.. ఇప్పుడు మాత్రం

23 Jan, 2021 08:25 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే అత్యధిక డిమాండ్‌ ఉన్న ఏకైక రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్‌. ఎన్ని రైళ్లు వచ్చినా గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న డిమాండ్‌ అలాంటిది. ఈ రైలులో రిజర్వేషన్‌ దొరికితే చాలు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. ఇక జనరల్‌ బోగీల్లో ప్రయాణించేందుకే ఉదయం నుంచి చాంతాడంత క్యూ కట్టాల్సిందే. తీరా రైలొచ్చాక సీటు కోసం కుస్తీ పట్టాల్సిందే. ఎప్పుడూ కిక్కిరిసి బయలుదేరే ఈ రైలు కరోనా ప్రభావంతో.. సాఫీగా రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం రిజర్వేషన్‌ ఉన్నవాళ్లు మాత్రమే ప్రయాణించడం వలన ఈ రైలు ప్రశాంతంగా బయలుదేరుతోంది. జనరల్‌ బోగీల్లో ప్రయాణించాలన్నా.. ముందుగా సీటు రిజర్వేషన్‌ చేయించుకోవాల్సిందే. దీంతో అందరూ రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులే వస్తున్నారు. దీంతో ఈ రైలు ఏ విధమైన తోపులాటలు, రద్దీ లేకుండా బయలుదేరుతోంది.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు