తిరుమలలో రెండుచోట్ల చిరుత సంచారం.. భక్తుల హడల్‌

9 Jul, 2021 12:16 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో చిరుత పులుల సంచారం మరోసారి కలకలం రేపింది. శుక్రవారం రెండవ ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం దాటాక వాహనానికి అడ్డంగా చిరుత పరుగులు తీసింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురైయ్యారు. ఘాట్ రోడ్డులో అందాలను తమ సెల్ ఫోన్‌ చిత్రీకరిస్తూ ఉండగా హఠాత్తుగా చిరుత కనిపించింది. వెంటనే సెల్ పోన్ ఆఫ్ చేసి వాహనానికి అద్దాలు మూసి అక్కడ నుండి వెళ్లిపోయారు భక్తులు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాహన దారులను అప్రమత్తం చేశారు.

అలాగే తిరుమలలోని సన్నిధానం అతిథిగృహం వద్ద వేకువజామున చిరుత హల్‌చల్‌ చేసింది. సన్నిధానం వద్ద గల రెస్టారెంట్ సమీపంలోని పందులను వేటాడేందుకు చిరుత వచ్చింది. అయితే చిరుత రాకను గుర్తించిన రెస్టారెంట్‌ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా సన్నిధానం అతిధి గృహం వద్ద తరచూ చిరుత సంచరిస్తున్నట్టు భక్తులు, టీటీడీ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సన్నిధానం అతిథిగృహం వద్ద కనిపించిన చిరుతే.. ఘాట్‌ రోడ్డులోదా? లేక రెండూ వేర్వేరా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు