‘తిరుపతిలో మరిన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు’

5 Aug, 2020 14:23 IST|Sakshi

సాక్షి, తిరుపతి: జిల్లాలో రోజురోజుకు కరోనా తీవ్రత అధికమవుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు‌ పోడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరిష తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉండేదని ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. అంతేగాక కరోనా లక్షణాలు లేని వారు పరీక్షలకు రావోద్దని ఈ సందర్భంగా కమిషనర్‌ సూచించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా