తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

29 Aug, 2021 18:00 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న రెండు రాష్ట్రాల సోదరీ సోదరులకు శుభాకాంక్షలు అంటూ లోకసభ స్పీకర్ ఓం బిర్లా ట్వీట్‌ చేశారు. ‘తెలుగు మహా కవి, రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా సుమాంజలి. భాషలు మన సమృద్ధికి.. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు దోహదపడతాయని’ ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిసిన ఏపీ గవర్నర్‌
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహా కవి, రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ వేడుక తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు దోహదపడుతుంది. ఎన్నో యుగాలుగా ఇక్కడి ప్రజల సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుతున్న తెలుగుభాషా గొప్పదనాన్ని చాటేందుకు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని’’ గవర్నర్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు