అదుపు తప్పి వాగులో పడిన లారీ

4 Sep, 2021 11:27 IST|Sakshi

అనంతపురం జిల్లా: ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఓ లారీ అదుపు తప్పి వాగులోకి పడింది. జిల్లెడువాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావటంతో గొల్లపల్లి వద్ద నిన్న కారు వాగులో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పులివెందుల-కదిరి మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దొరిగిల్లు మీదుగా పులివెందులకు వాహనాలు వెళ్తున్నాయి. ఇదే నేపథ్యంలో జిల్లెడువాగు దాటుతూ టెన్ టైర్ లారీ ఒకటి అదుపు తప్పి కిందకు పడిపోయింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

ఇవీ చదవండి:
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి ఎఫెక్ట్‌: సబ్‌ రిజిస్ట్రార్‌ సురేష్‌ ఆచారి సస్పెన్షన్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు