ఖమ్మం అమ్మాయి.. నెల్లూరు అబ్బాయి.. పారిపోయి వచ్చి..

6 Jan, 2023 20:38 IST|Sakshi

సాక్షి, నెల్లూరు(కొండాపురం): ప్రేమించి వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కొండాపురం పోలీసులను గురువారం ఆశ్రయించింది. వివరాలు.. పామూరు మండలం కుంటపల్లికి చెందిన గురవయ్య, వరలక్ష్మి దంపతులు. వారు కుమారుడు గురుబ్రహ్మంతో కలిసి తెలంగాణం రాష్ట్రం ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. అక్కడ పీ సంధ్య అనే యువతితో గురుబ్రహ్మానికి పరిచయం ఏర్పడింది.

ఇరువురు ఏడాది పాటు ప్రేమించుకున్నారు. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో  పారిపోయి ఐదు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. కొండాపురంలోని యువకుడి బంధువుల వద్దకు చేరుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇరువురు మేజర్లు కావడంతో యువతి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తెలియజేశామని ఎస్సై ఖాజావళి తెలిపారు.   

చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు