పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

14 Aug, 2021 16:08 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, విశాఖప్నటం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక జారీ చేశారు.
  

మరిన్ని వార్తలు