నేడు బలపడనున్న అల్పపీడనం

28 Jul, 2021 03:05 IST|Sakshi

తేలికపాటి వర్షాలు

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం తీవ్రరూపం దాల్చి రానున్న మూడు రోజుల్లో పశ్చిమ దిశలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్‌ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుందని వివరించారు.

రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రాయలసీమలో మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ఏపీలో పడమర దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.  

మరిన్ని వార్తలు