Rain Alert: ఏపీలో రెండు రోజులు వర్షాలు

27 Oct, 2021 08:24 IST|Sakshi

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం

మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని కారణంగా రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

చదవండి: Extramarital Affair: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు!  

మరిన్ని వార్తలు