అల్ప పీడనం: మరో రెండు రోజుల పాటు వర్షాలు

18 Aug, 2020 19:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్  20 °N  అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతున్న అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక తదుపరి 42 గంటల్లోగా ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఏపీకి రాగల మూడు రోజుల పాటు వర్ష సూచన
తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ, రేపు(బుధవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు