మచిలీపట్నం: టీకా తీసుకున్న వ్యక్తికి పాజిటివ్‌

29 Jan, 2021 18:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణాజిల్లా: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే టీకా తీసుకున్న తర్వాత కూడా కోవిడ్‌ బారిన పడటంతో వ్యాక్సిన్‌ సామార్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లాలో వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడం.. స్థానికంగా కలకలం రేపుతోంది.
(చదవండి: కోవిడ్‌ టీకా తీసుకున్న ఉపాసన)

వివరాలు..  మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తొలివిడతలో భాగంగా కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడికి కోవిడ్‌ టెస్ట్‌ చేయగా.. పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తాము పరీక్షలు చేయించుకోగా.. దాదాపు 8 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీకా తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్‌ రావడంతో వ్యాక్సిన్‌ సామార్థ్యంపై జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. 
 

>
మరిన్ని వార్తలు