వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

2 Oct, 2022 11:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు