75 వేల ఇనుప వ్యర్థాలతో గాంధీ విగ్రహం

21 Jun, 2021 10:11 IST|Sakshi

సాక్షి, తెనాలి: శిల్పకళలో ఖండాంతర ఖ్యాతిని కలిగిన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం, ఇనుప వ్యర్థాలతో తీర్చిదిద్దిన కళాకృతుల్లోనూ ఘనత వహిస్తోంది. ఇనుప వ్యర్థాలతో జీవం ఉట్టిపడే శిల్పాలను చేస్తూ, విదేశాల్లోనూ ప్రదర్శిస్తోన్న స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తాజాగా భారీ ధ్యాన గాంధీ విగ్రహాన్ని రూపొందించారు.

10 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ విగ్రహానికి 75 వేల ఇనుప నట్లను వినియోగించారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం చేసిన ఈ విగ్రహాన్ని ఆదివారం తమ శిల్పశాల ఎదుట ప్రదర్శనకు ఉంచారు.

చదవండి: ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా ఆటో డ్రైవర్‌ కుమారుడు

కృష్ణానది ఒడ్డున ఘాతుకం: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం

మరిన్ని వార్తలు