ఆప్కాబ్‌ ఛైర్‌పర్సన్‌గా మల్లెల ఝాన్సీ బాధ్యతల స్వీకరణ

31 Jul, 2021 13:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఛైర్‌పర్సన్‌గా మల్లెల ఝాన్సీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవసాయశాఖమంత్రి కురుసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సహకార వ్యవస్థలో కొత్త అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆప్కాబ్, సహకారశాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని, సహకార సంఘాల అభున్నతికి సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. 

‘ఆడిట్ విధానాన్ని బలోపేతం చేయడం , పూర్తి స్థాయిలో సహకార సంఘాల కంప్యూటీకరణ , మానవ వనరుల పాలసీ తదితర నిర్ణయాలను తీసుకున్నాం. అప్కాబ్‌కు తొలి మహిళా పర్సన్ ఇన్ ఛార్జ్ గా మల్లెల ఝాన్సీ ని సీఎం నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత అప్కోబ్ చాల  ఒడిదుడుకులను  చూసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి నాలుగు జిల్లాల్లో సహకార కేంద్ర బ్యాంకులు నష్టాల్లో ఉండేవి. ఈ  ప్రభుత్వ పారదర్శక నియమాలు, నియంత్రణ, ఇతర చర్యల వల్ల నేడు అన్ని జిల్లాల డీసీసీబీ లు లాభాల బాటలో పడ్డాయి. ఈ ఏడాది 31 వేల కోట్ల రూపాయిల టర్నోవర్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం. 

అప్కాబ్‌లో ప్రతి రూపాయి రైతు కష్టం, అత్యంత బాధ్యతగా, నిజాయితీగా రైతు డబ్బు ను మనమంతా కాపాడాలి. నిధుల దుర్వినియోగం , విధుల పట్ల నిర్లక్ష్యం చేసేవాళ్లపై కఠిన చర్యలు  తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పారు. గుంటూరు సహా పలు జిల్లాల డీసీసీబీలు చాల బాగా నడుస్తున్నాయి , రైతుకు , చిరు వ్యాపారాస్థులకు ఉపయోగపడే వివిధ స్కీములను అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు అప్పులిచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల నియమితులైన అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లకు , డీసీఎంఎస్ చైర్మన్లకు అభినందనలు’ తెలిపారు మంత్రి కన్నబాబు.

మరిన్ని వార్తలు