రోగిని సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసిన వ్యక్తి అరెస్టు

14 Nov, 2021 10:54 IST|Sakshi

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని  ఈసీ జీ గదిలో ఒక యువతికి పరీక్షలు చేస్తూ, సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసిన వ్యక్తిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కొత్తపేట పీఎస్‌ ఎస్‌ఐ ఖాజీబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన ఒక యువతి అనారోగ్య కారణాలతో ఈసీజీ తీయించుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈసీజీ విభాగంలో పనిచేస్తున్న రాకేష్‌ వ్యక్తిగత సెలవులో ఉండటంతో అతడి స్థానంలో నల్లచెరువుకు చెందిన బత్తుల హరీష్‌ను ఉంచాడు.

ఆస్పత్రిలో నిత్యం హరీష్‌ ఈసీజీ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాత గుంటూరుకు చెందిన యువతికి పరీక్షలు చేస్తున్న సమయంలో ఆమెను హరీష్‌ సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీన్ని గుర్తించిన యువతి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆమె తల్లి, ఇతర రోగులు, అవుట్‌పోస్ట్‌ పోలీసులు వచ్చి హరీ‹Ùను పట్టుకున్నారు.  

మరిన్ని వార్తలు