నెల్లూరు: బాలిక గొంతుకోసిన ఘటనలో కామాంధుడి అరెస్ట్‌

6 Sep, 2022 14:06 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో  బాలిక గొంతుకోసి, యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. బాధితురాలికి దగ్గరి బంధువు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

కాగా ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
చదవండి: విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి

మంత్రి పరామర్శ
చెముడుగుంటలో దుండగుడి చేతిలో గాయపడి నెల్లూరులోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్న మైనర్‌ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఆడబిడ్డలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాలికకు సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే చెన్నైకు తరలిస్తామన్నారు.  చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

జిల్లా అధికారుల పరామర్శ 
దుండగుడి చేతిలో గాయపడిన మైనర్‌ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఎస్పీ సీహెచ్‌ విజయారావు, నెల్లూరు కమిషనర్‌ హరిత, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ హరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు  పరామర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్‌రెడ్డితో మాట్లాడి   బాలికకు మెరుగైన వైద్యం అందిం చేందుకు అపోలోకు తరలించామని గిరిధర్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు