పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం

17 Apr, 2021 09:07 IST|Sakshi
భార్య,బిడ్డతో శివ(ఫైల్‌)

చంద్రగిరి: అన్యోన్య దాంపత్యానికి దిష్టి తగిలింది. ఆదర్శజంటను రోడ్డు ప్రమాదం విడదీసింది. పెళ్లిరోజునే పెనిమిటిని మృత్యువు కబళించింది. సాఫీగా సాగుతున్న జీవితం తలకిందులైంది. వివరాలు.. చంద్రగిరి మండలం మఠంపల్లెకు చెందిన శివ(30) తిరుపతిలో డిజైనర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పవిత్రను గత ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం వారికి ఓ అబ్బాయి పుట్టాడు.

గురువారం రాత్రి విధులు ముగించుకుని తిరుపతి నుంచి స్వగ్రామానికి శివ బైక్‌పై బయలుదేరాడు. తొండవాడ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన శివను 108లో తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పెళ్లిరోజునే మరణించావా అంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో మఠంపల్లె విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
ఈ ఆవు దూడ ఎంత లక్కీ అంటే..
‘మా అన్నయ్య టెకీ, వదిన డాక్టర్‌.. తనపై ఆ ముద్ర సరికాదు’

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు