అరే ఏంట్రాఇది.. ఏకంగా పోలీసు వాహనాన్నే..

27 Sep, 2022 07:30 IST|Sakshi
మతిస్థిమితం లేని నవీన్‌కుమార్‌, అపహరణకు గురైన వాహనం  

సాక్షి, అమరాపురం (సత్యసాయి జిల్లా): ఓ వ్యక్తి ఏకంగా పోలీసు వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. చాలా దూరం వెళ్లి ఓ చెట్టును ఢీకొన్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసి అవాక్కయ్యారు. అమరాపురంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామానికి చెందిన రామన్న కుమారుడు నవీన్‌కుమార్‌ సోమవారం ఉదయం అమరాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు.

పరిసరాల్లో నిలిపి ఉంచిన పోలీసు జీపులో తాళం కూడా ఉండడంతో వేసుకుని వెళ్లిపోయాడు. మండలంలోని వలస సమీపంలో ఓ చింతచెట్టుకు ఢీ కొట్టాడు. అక్కడున్న వారు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, వారు వచ్చి నవీన్‌కుమార్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారు. పోలీసులు నవీన్‌కుమార్‌ను తీసుకెళ్లారు. పోలీసు వాహనాన్ని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడన్న విషయం చర్చనీయాంశమైంది.

చదవండి: (కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్‌ అవ్వాల్సిందే)  

మరిన్ని వార్తలు