రయ్‌.. రయ్‌.. ఐడియా ఆన్‌ వీల్స్‌!

3 Jun, 2021 19:26 IST|Sakshi

ఆలోచనే మనిషికి ఇం‘ధనం’. దాన్నే పెట్టుబడిగా చేసుకుని ‘రోడ్డెక్కితే’ ఎన్నో కొత్త అంశాలు ఆవిష్కృతమవుతాయి. ‘మేనుకు చేవ / చేతికి రొక్కం’ రెండూ దక్కుతాయి. అసలు మస్తిష్కానికి పదును పెట్టాలే గానీ అద్భుతాలు మన ముంగిటే వచ్చి వాల్తాయి. అలాంటి అద్భుతాన్ని ఇదిగో ఇలా చేసి చూపించాడు ఓ రిక్షావాలా. చిన్న ద్విచక్ర వాహన ఇంజినుకు రిక్షాను అనుసంధానించి రయ్‌ మంటూ విజయవాడ వీధులో వెళ్తున్న ఈ రిక్షావాలా ప్రయోగాన్ని అందరూ ముక్కున వేలేసుకుని మరీ చూస్తున్నారు. భళిరా! నీ ఆలోచన అంటూ అభినందిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ  

ఇక్కడ చదవండి:
Ayesha Charugulla: విజయవాడ టు అమెరికా

Photo Feature: విరగకాసిన పనస చెట్టు

మరిన్ని వార్తలు