నిండు ప్రాణాన్ని బలికొన్న వివాహేతర సంబంధం

25 Sep, 2023 13:29 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో దారుణం వెలుగుచూసింది.  తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టకున్నడనే కారణంతో ఓ యువకుడిని భర్త కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. 4వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొంతకాలంగా శివారెడ్డి భార్యతో కిషోర్‌ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివారెడ్డి పలుమార్లు ఇద్దరిని మందలించాడు. 

అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కిషోర్‌ అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కిషోర్‌కు ఫోన్‌ చేసి బయటకు రావాలని చెప్పాడు. కిషోర్‌ రామ టాకిస్‌ వద్దకు చేరుకోగా అతన్ని శివారెడ్డి మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన కిషోర్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు

మరిన్ని వార్తలు