పీపీఈ కిట్‌తో వ్యక్తి హల్‌చల్‌.. పరుగో పరుగు

14 Nov, 2020 13:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ మన్యంలో పీపీ కిట్‌తో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. అతన్ని చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్‌ ధరించి కనిపించాడు. కనిపించిన వారందరిని పలకరిస్తూ దగ్గరకు వెళ్లాడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు అతను కోవిడ్‌ రోగిగా భావించి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలిసిన వైద్య అధికారులు తమ ఆసుపత్రిలో ఉన్న రోగులను సరి చూసుకున్నారు.అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు. చదవండి: ఈ చిన్నారి నా హృదయాన్ని దోచుకున్నాడు: కేటీఆర్‌

అయితే వ్యర్థాలతో పడేసిన పీపీఈ కిట్‌ను ధరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. తీరా అతన్ని ఆపి దూరం నుంచే ప్రశ్నించగా.. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని అందరూ షాక్‌కు గురయ్యారు. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని చెప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనితో పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపించి వేశారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు