వైఎస్సార్‌కు భారతరత్న ప్రకటించాలని పాదయాత్ర

2 Aug, 2021 08:31 IST|Sakshi
లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో అమరజ్యోతితో గణేష్‌  

సింహాచలం (పెందుర్తి): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి భారతరత్న ప్రకటించాలని ఏయూ పూర్వ విద్యార్థి, వైఎస్సార్‌ అమరజ్యోతి స్టూడెంట్స్‌ అండ్‌ యూత్‌ ఫోర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం జెడ్‌.కొత్తపట్నంకి చెందిన గాలి గణేష్‌ ఆదివారం సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చెంత నుంచి ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టారు.

సింహాచలంలోని కొండదిగువన స్వామివారి తొలిపావంచా వద్ద పూజలు నిర్వహించి అమరజ్యోతిని వెలిగించారు. అనంతరం అమరజ్యోతిని పట్టుకుని పాదయాత్రని ప్రారంభించారు. అనంతరం గాలి గణేష్‌ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. అందుకే ఆయనకు భారతరత్న ప్రకటించాలని, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని కోరుతూ పాదయాత్ర చేపట్టానన్నారు. వచ్చే నెల 2న వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా పాదయాత్ర ఇడుపులపాయలోని ఆయన స్మృతి వనానికి చేరుకుంటుందన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు