శ్రీవారిని దర్శించుకున్న విష్ణు, మంచు లక్ష్మి

30 Oct, 2020 12:06 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు, మంచు లక్ష్మి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వరుని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

ఆలయం వెలుపల మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ... తిరుపతిలో మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని, మోసగాళ్ళు సినిమా త్వరలోనే విడుదల కానుందని అన్నారు. మోసగాళ్ళు సినిమా విడుదల సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు పొందమని చెప్పారు. త్వరలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు.

చదవండి: అంతకు మించి దారి లేదంటున్న హీరో సూర్య

మరిన్ని వార్తలు