‘పవన్‌ కల్యాణ్‌ది ద్వంద్వ వైఖరి’

26 Jul, 2020 19:29 IST|Sakshi

రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావ్‌

సాక్షి, అమరావతి: రేషన్ డీలర్ల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీకి లేఖ రాయాలని పవన్‌ కల్యాణ్‌ను రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇవ్వాల్సిన నాలుగు విడతల కమీషన్‌ను విడుదల చేయించాలని, రేషన్‌ డీలర్లను కరోనా బీమా కింద పరిధిలోకి తీసుకురావాలని పవన్‌ కోరాలన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంపై తప్పు నెట్టేందుకు ఎప్పటిలాగే పవన్‌కల్యాణ్ ద్వంద్వ వైఖరి ఉందని విమర్శించారు. రేషన్‌ డీలర్ల సమస్యలను రాజకీయం చేయొద్దన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన కమీషన్‌ను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారని.. రేషన్ డీలర్లకు అండగా ఉన్నారని వెంకట్రావ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు