ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

1 Mar, 2024 20:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా శశిభూషన్ కుమార్ బదిలీ అవ్వగా, బుడితి రాజశేఖర్‌ను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

పంచాయతీ రాజ్ కమిషనర్‌గా కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్‌గా సూర్యకుమారిలను బదిలీ చేయగా, సెర్ప్ సీఈవోగా మురళీధర్ రెడ్డికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్ధన్‌కి అదనపు బాధ్యతలు, సీసీఎల్‌ఏ సెక్రటరీగా వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

whatsapp channel

మరిన్ని వార్తలు