ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు

28 Nov, 2020 08:38 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో శనివారం మరోసారి తుపాకీలు దద్దరిల్లాయి. సరిహద్దుల్లో కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సభ్యుడు ఒకరు మృతి చెందారు. ఘటనపై మల్కనగిరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కాల్పుల్లో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మిల్ట్రీ ప్లాటు ఇంచార్జ్ కిషోర్ మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు ఏసీఎమ్ నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్నాం. మరో దళ సభ్యుడు పోలీసుల ముందు లొంగిపోయారు' అని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా, సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని తోటగుర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు అనంతరం కూడా కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు