నంద్యాలలో భారీ అగ్నిప్రమాదం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

30 Mar, 2021 22:37 IST|Sakshi

సాక్షి, కర్నూలు: నంద్యాల చెక్‌పోస్ట్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో 3 గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చెక్‌పోస్ట్‌ సర్కిల్‌ పక్కనే ఉన్న గుడిసెలు దగ్ధమవుతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌, షాప్‌లకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో నంద్యాల, నందికొట్కూరు రహదారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు