విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం

25 May, 2021 15:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సేఫ్టీ సైరన్‌ మోగడంతో  ఉద్యోగులు పరుగులు తీశారు. భారీ శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. హెచ్‌పీసీఎల్‌ నుంచి సాధారణం కంటే దట్టంగా పొగలు వ్యాపించాయి. పరిస్థితిని ఫైర్‌ సిబ్బంది  అదుపులోకి తెచ్చారు. ప్రమాద స్థలాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్‌, సీపీ మనీష్‌ కుమార్‌ పరిశీలించారు.

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు: మంత్రి అవంతి
హెచ్‌పీసీఎల్‌ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.

పరిస్థితి అంతా అదుపులోనే ఉంది: కలెక్టర్‌
ఓవర్‌హెడ్‌ పైప్‌లైన్‌లో లీకేజి వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. సీడీయూ మూడో యూనిట్‌లో ప్రమాదం జరిగిందన్నారు. ఓవర్‌ హెడ్‌ పైప్‌లైన్‌ దెబ్బతినడం వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్‌ వివరించారు. యూనిట్‌ మొత్తాన్ని షట్‌డౌన్‌ చేశారని.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం వచ్చిందని.. వెంటనే అంతా అప్రమత్తమయ్యామని తెలిపారు.

చదవండి: తిరుపతి ఎస్‌వీవీయూలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలు


 

మరిన్ని వార్తలు