ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. సీఎంఓ స్పెషల్‌ సీఎస్‌గా మాలకొండయ్య

29 Nov, 2022 17:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. సీఎంఓ స్పెషల్‌ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గాగా మధుసూదన రెడ్డిలను నియమించింది. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్ అండ్ బి సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్లను బదిలీ చేసింది.

ప్రస్తుతం సీఎంఓ స్పెషల్‌ సీఎస్‌గా బాధ్యతలు చేపడుతున్న కెఎస్‌ జవహర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ కొద్ది సేపటికే ఐఏఎస్‌ల బదిలీలపై ఉత్తర్వులు ఇచ్చింది. 

ఇదీ చదవండి: ఏపీ నూతన సీఎస్‌గా కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి.. ఉత్తర్వులు జారీ

మరిన్ని వార్తలు