తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలిన డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి సతీమణి

16 Apr, 2022 11:01 IST|Sakshi
సూర్యలంక సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న రమాదేవి  

సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. తాబేళ్లను సంరక్షించడం ద్వారా పునరుత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలీవ్‌ రిడ్లే సముద్రపు తాబేళ్ల పిల్లలను డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి సతీమణి రమాదేవి సముద్రంలోకి శుక్రవారం వదిలారు.

జల కాలుష్యం నివారణలో తాబేళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కోన రమాదేవి పేర్కొన్నారు. తాబేళ్ల గుడ్ల  సేకరణ, సంరక్షణ, వాటి పునరుత్పత్తి  కేంద్రాన్ని బాపట్ల సూర్యలంకలో రాష్ట్ర అటవీ శాఖ ఏలూరు జోన్‌ అవనిగడ్డ అటవీ రేంజ్‌ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు.  

చదవండి: (ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరం: ఆర్‌.నారాయణమూర్తి) 

మరిన్ని వార్తలు