మురళీకృష్ణ ఆసుపత్రికి నోటీసులు

23 Aug, 2020 21:36 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: అనధికారికంగా కోవిడ్‌ బాధితులకు వైద్యం చేస్తూ దోపిడీ పర్వానికి తెరలేపిన ఏలూరులోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్యశాఖ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల సోదాలనంతరం ఆసుపత్రి లోని పలు అక్రమాలు జరిగినట్లు  అధికారులు గుర్తించారు. కరోనా సోకిన రోగులకు చికిత్స చేసేందుకు అనుమతి లేకున్న చికిత్స చేసినట్లు అధికారులు ద్రువీకరించారు. కాగా 11మంది చికిత్స పొందుతూ మృతి చెందినా, ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని అధికారులు తెలిపారు.

కరోనా చికిత్స పేరుతో  లక్షల రుపాయలను యాజమాన్యం వసూలు చేసిందని, అయితే గరిష్ఠంగా తొమ్మిది లక్షల రూపాయలను  మురళీకృష్ణ ఆసుపత్రి వసూళ్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. 15 రోజులలో వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి ఎండీ మురళీకృష్ణ కు వైద్యశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ పదిహేను రోజుల పాటు ఆసుపత్రి సేవలు రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు.  కరోనా‌ సోకిన‌ వ్యక్తికి రెండు లక్షల రుపాయలు గరిష్ఠంగా వసూళ్లు చేశారని, రోజుకు లక్ష రుపాయలు వసూళ్లు చేసినట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో వాడుతున్న సుమారు 10 లక్షల విలువైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అధికారులు సీజ్‌ చేశారు.
చదవండి: ఏలూరులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు