‘పరిశ్రమలు రావాలంటే సులభమే.. కానీ’

19 Jan, 2021 13:30 IST|Sakshi

మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

సాక్షి, విజయనగరం : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. మార్గాలు అన్వేషించి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా వ్యవస్థ రూపొందించాలని సీఎం జగన్‌ ఎప్పుడూ కోరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమలు రావాలంటే సులభమే కానీ కాలుష్యంతో కూడిన పరిశ్రమలు వస్తే అది‌ అభివృద్ధికి దొహదపడదని అన్నారు. ఇదే సీఎం ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. కాలుష్యంతో కూడిన పరిశ్రమలు రాష్ట్రానికి వద్దని సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతుంటారని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం చూస్తే సీఎం విజన్ అర్థమైపోతుందని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: కర్నూలు ఎయిర్‌పోర్టుకు డీజీసీఏ అనుమతులు 

మంచి విద్యార్థులను తయారు చేస్తే చాలని, వారిలో ఓ పారిశ్రామికవేత్తకు ఉన్న లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు. మూడు ప్రాథమిక అంశాలు విద్యా, ఉపాధి, ఆరోగ్యంపైన ఎక్కువ దృష్ట పెడితే భవిష్యత్తులో అభివృద్ధిని చూడనవసరం లేదన్నది‌ తమ ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగానే వెళ్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించబోతున్నామని తెలిపారు. పరిశ్రమలకు రాయితీలు అవసరమే కానీ పాత విధానంలో ఇస్తే సరికాదన్నది తమ అభిప్రాయమని,  97 వేల ఎంఎస్ఎంఈ లకు 11 వందల కోట్లు రాయితీ రూపేనా ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. ‌కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. మేరిటైమ్ బోర్డును స్థాపించి పోర్టు, హార్బర్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రోడ్ బ్రిడ్జ్ కనెక్టివిటీలను బలోపేతం చేస్తున్నామని, వ్యాపార రంగాన్ని మరిత సులభతరం చేస్తున్నామని పేర్కొన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు