అమ్మవారిని దర్శించుకున్న మేకపాటి గౌతం రెడ్డి

23 Oct, 2020 09:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవరోజు  దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్బుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీమహాలక్ష్మీ అమితరమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్ధితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృత స్వరూపాణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుంది.  మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. (చదవండి: నవరాత్రులు.. నవ వర్ణాలు)

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి
మహాలక్ష్మి రూపంలో కనక దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఇంద్రకీలాద్రీ
నమస్తేస్తు మహామాయే 
శ్రీపీఠే సురపూజితే! 
శంఖ చక్ర గదా హస్తే 
మహాలక్ష్మీ నమోస్తుతే!!

మరిన్ని వార్తలు