స్వగ్రామం నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం: మేకపాటి గౌతమ్‌ రెడ్డి

3 Sep, 2021 22:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్వగ్రామం నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే అవకాశం కల్పించనున్నట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ''వర్క్‌ ఇన్‌ హోమ్‌ టౌన్‌'' సెంటర్ల నమూనా రూపకల్పను ఆదేశాలు జారీ చేశారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఐటీ నైపుణ్యం, ఫైబర్‌నెట్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు కానుంది. దీంతో కన్నవారితో ఉ‍న్న ఊరిలోనే ఐటీ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుందని గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు