ఐఎస్‌బీతో మేకపాటి గౌతమ్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

29 Oct, 2020 17:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: పారిశ్రామిక పరివర్తన దిశగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దడానికి ఐఎస్‌బీ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని క్యాంప్‌ కార్యలయం నుంచి గురువారం గౌతమ్‌ రెడ్డి ఐఎస్‌బీతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాలసీ ల్యాబ్, రిమోట్ వర్క్, పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. 'రిమోట్ వర్క్'పై త్వరలో ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా ఫార్మా సహా పలు రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం జాన్స్ హాప్ కిన్స్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని తెలిపారు. (చదవండి: ఏపీలో ‘లంబోర్గిని’)

మరిన్ని వార్తలు