మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి

8 May, 2022 08:21 IST|Sakshi

మర్రిపాడు: మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ నేతగా మేకపాటి విక్రమ్‌రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మెట్టప్రాంత అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం కృషి చేస్తోందన్నారు. మెట్ట ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ఫేజ్‌–1, 2తో పాటు ఈ ప్రాంతంలో విద్య, వైద్యానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గ్రామాల వారీగా నాయకులను విక్రమ్‌రెడ్డికి పరిచయం చేయించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను నిరంతరం అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతకు ముందుగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డిలను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కేతా వేణుగోపాల్‌రెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, బోయళ్ల పద్మజారెడ్డి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొర్రా సుబ్బిరెడ్డి, జెడ్పీ కో–ఆప్షన్‌ సభ్యులు షేక్‌ గాజుల తాజుద్దీన్, సొసైటీ చైర్మన్‌ యర్రమళ్ల చిన్నారెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, నారపరెడ్డి సుబ్బారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు