రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి

19 May, 2022 09:39 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

‘ఉదయగిరి’కి గుర్తింపుపై మేకపాటి హర్షం

సాక్షి, నెల్లూరు: ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారన్నారు.

ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచిపరిణామమని కొనియాడారు.

చదవండి: (ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్‌: రాజ్‌నాథ్‌)

మరిన్ని వార్తలు