దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు

27 Sep, 2020 05:11 IST|Sakshi
మాట్లాడుతున్న హోం మంత్రి సుచరిత, పక్కన ఎమ్మెల్యే విడదల రజని

రాష్ట్ర హోం మంత్రి సుచరిత

చిలకలూరిపేట: దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని క్రైస్తవ శ్మశానవాటికను ఎమ్మెల్యే విడదల రజనితో కలిసి శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి విమర్శించేందుకు ఏమీ లేక టీడీపీ వంటి ప్రతిపక్షాలు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు అంతర్వేది వంటి ఘటనలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు అంతర్వేది కేసు విచారణను సీబీఐకి అప్పగించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు