‘పునరావాస కాలనీ’లు పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు

26 Aug, 2021 04:28 IST|Sakshi
పెదభీంపల్లి–2 పునరావాస కాలనీలో పర్యటిస్తున్న అనంతనాయక్‌

దేవీపట్నం: జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు అనంత నాయక్‌ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పోలవరం పునరావాస కాలనీలను బుధవారం సందర్శించారు. పెదభీంపల్లి 2,3 కాలనీలను మూలమెట్ట, మెట్టవీధి గ్రామస్తులకు నిర్మించిన పోతవరం కాలనీలో ఇళ్లను, టాయిలెట్లను, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్వాసితులకు అందిస్తున్న ప్యాకేజి ప్రయోజనాలు, పునరావాస కాలనీలు, భూమికి భూమి పరిహారం, జరుగుతున్న పనుల వివరాలను పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ ఆనంద్, ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య, సబ్‌ కలెక్టర్‌ సింహాచలం ఆయనకు వివరించారు.

కొండమొదలు పంచాయతీలో గ్రామాలకు నిర్మించిన కాలనీలో నిర్వాసితుల సమస్యలు తెలుసుకుని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. అనంత నాయక్‌ మాట్లాడుతూ..జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆదేశాల మేరకు పునరావాస కాలనీల పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. గిరిజన నిర్వాసితుల సమస్యలను కమిషన్‌కు నివేదిస్తామని, అవసరమైతే రాష్ట్రపతికి కూడా నివేదిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు