సుబ్బరాయుడుది ముమ్మాటికి టీడీపీ హత్యే

31 Oct, 2020 14:20 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ‘వైఎస్సార్‌సీపీ నాయకుడు, న్యాయవాది వుడూరు సుబ్బరాయుడుది తెలుగుదేశం పార్టీ చేయించిన హత్యే. ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చూస్తూ ఊరుకోరని’ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబ సభ్యులను పార్టీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం పరామర్శించారు.   (వైఎస్సార్‌సీపీ నేత హత్య)

ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. సుబ్బరాయుడు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏపీలో దళితుల్ని భయభ్రాంతులకు గురిచేసి, వారిని అణచివేసే ధోరణిలో చంద్రబాబు, టీడీపీ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటు. సుబ్బరాయుడును హత్య చేయడం దారుణమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ హత్య తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రలో భాగమే. టీడీపీకి అండగా ఉన్న తోక పత్రికల్లో అవాస్తవాలు రాయించి ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేస్తున్నారు.  (చంద్రబాబు, లోకేశ్‌ ఎక్కడ దాక్కున్నారు?)

దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు నాయుడు మాటలను ఆదర్శంగా తీసుకునే టీడీపీ నాయకులు దళితులపైన దాడులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకొని, శిక్షించాలించాలి. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకే సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం' అని మేరుగ నాగార్జున, శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు