‘చంద్రబాబు ప్రజల్లో ఉండి విమర్శిస్తే బాగుండేది’

23 Jul, 2020 17:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉండి విమర్శలు చేస్తే బాగుండేది అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు ట్విటర్, జూమ్ మీడియా సమావేశాలతో విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దళితులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీల మధ్య తగాదాలు పెట్టి చంద్రబాబు సంతోషపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.(ఆరోగ్య ఆస‌రా కింద రూ. 5 వేలు సాయం)

అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారంలో లేనపుడు మరొక విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. దళిత మహిళను ఎప్పుడైనా హోం మంత్రి చేశావా అని చంద్రబాబుని ప్రశ్నించారు. దళితులకు ఇచ్చే ఇళ్ల పట్టాలను కోర్టులకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. అంబేడ్కర్ విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. దళితులు బాగుపడకూడదని ఇంగ్లీషు మీడియంను చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. దళితులు శుభ్రంగా ఉండరన్న వారికి చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారని తెలిపారు. దళిత పక్ష పాతి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. దళితులకు అన్యాయం జరిగితే సీఎం జగన్ సహించరన్నారు. దళితులపై దాడి చేసిన వారిపై చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. టీడీపీలో దగాపడ్డ దళితుడు వర్ల రామయ్య అన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న చంద్రబాబుపై వర్ల రామయ్య మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాయాలని సూచించారు.(అసత్య వార్తలకు స్వస్తి చెప్పాలి: శ్రీకాంత్‌రెడ్డి)


గ్రామ వార్డు సచివాలయాల ద్వారా బడుగుబాలహీన వర్గాలు వారికి సీఎం జగన్ ఉద్యోగ అవకాశాలు కల్పించారని పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో దళిత మహిళను హోం మంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెలిపారు. తన కేబినెట్‌లో నలుగురు ఎస్సీలకు మంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. నామినేటెడ్ పదవులు పనుల్లో బడుగుబలహీన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. 60శాతం మంది బడుగుబలహీన వర్గాల వారికి తన మంత్రి వర్గంలో అవకాశం కల్పించారన్నారు. తనకు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు కోర్టుల్లో ఇళ్ల స్థలాలపై కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విభజించారని తెలిపారు.

మరిన్ని వార్తలు