అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

22 Aug, 2022 05:13 IST|Sakshi
అంబేడ్కర్‌ ప్రాజెక్ట్‌ పనులను పరిశీలిస్తున్న మంత్రి నాగార్జున

సాక్షి, అమరావతి: విజయవాడలో చేపట్టిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో జరుగుతోన్న అంబేడ్కర్‌ ప్రాజెక్ట్‌ పనులను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విగ్రహం ఏర్పాటు చేయనున్న వేదిక వద్ద జరుగుతోన్న కాంక్రీట్, కన్వెన్షన్‌ సెంటర్‌ పనులను పరిశీలించారు.

నిర్ణీత గడువులోగా విగ్రహ నిర్మాణ పనులను పూర్తి చేయడం కోసం రాత్రి పగలు పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు చెప్పిన విధంగానే విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న అంబేడ్కర్‌ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారని, పనులు ఆలస్యం కాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు